హైదరాబాద్‌లోని సరూర్ నగర్, మైత్రి నగర్లో నివాసముండే కాచం కిరణ్ కుమార్ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. అలాగే అధిక వడ్డీలు ఇస్తానంటూ పలువురికి ఆశ పుట్టించాడు.
ఈ క్రమంలో డబీర్ పురాకు చెందిన నజీర్ అహ్మద్, మరో ఇద్దరు విజయలక్ష్మీ పసునూరి, దాచేపల్లి ప్రకాశ్‌లు రూ. 76 లక్షలు అతడి వద్ద డిపాజిట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్న సొంత ఇంటిని విక్రయించి.. ఎవరికీ తెలియకుండా నగరం విడిచి కిరణ్ కుమార్ పారిపోయాడు.
విషయం తెలుసుకున్న బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇతడి మోసాలు రూ. 76 లక్షలు కాదు.. మొత్తం ఐదు కోట్ల వరకు వసూలు చేసి పరారయినట్లు విచారణలో తేలింది. దర్యాప్తు చేపట్టిన బృందాలు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాయి.
ఇదీ చదవండి: ఫైనాన్స్ బిజినెస్ పేరుతో రూ. 13 కోట్లు కాజేసిన దంపతుల అరెస్ట్