ఆదాయానికి మించి ఆస్తుల కేసులో... ఓ వైద్యుడు, ఆయన భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రవీందర్... విశ్వవిద్యాలయంలోని పాఠశాలలో పనిచేస్తున్న ఆయన భార్య సుజాతపై కేసు నమోదు చేశారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలోనే రవీందర్ తన పేరు మీద... తన భార్య పేరు మీద భారీగా ఆస్తులు కూడబెట్టాడు.
రూ.3కోట్ల 86లక్షల ఆస్తులను డాక్టర్ రవీందర్ సంపాదించినట్లు సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలింది. రవీందర్, అతని భార్యకు నెలకు వచ్చే ఆదాయం... ఖర్చుల ప్రకారం చూస్తే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడి... సంపాదించినట్లు తేల్చిన సీబీఐ అధికారులు... రవీందర్, ఆయన భార్య సుజాతపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి : ముంబయి దాడి సూత్రధారిని పట్టిస్తే రూ.37 కోట్లు