ఆంధ్రప్రదేశ్ ఎంపీ, తెలుగుదేశం నేత కేశినేని నాని తమ్ముడినంటూ... తమ నుంచి కేశినేని రమేష్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ పలువురు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ గేట్ వే హోటల్లో భాగస్వామినని, హెచ్ఆర్ఎం ఫైనాన్స్ సంస్థకు ఎండీనని నమ్మించి, గుంటూరు, తాడేపల్లికి చెందిన వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికేశ్వరరావు అనే వ్యక్తికి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.20 లక్షలు, శ్రీనివాసరావు అనే మరో వ్యక్తి నుంచి నాలుగున్నర లక్షల రూపాయలను తీసుకున్నాడని వాపోయారు.
ఇదీచదవండి. ప్రభుత్వభూమిలో అక్రమకట్టడాలు.. కూల్చేసిన అధికారులు..