హైదరాబాద్లో ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి అతివేగంగా.. దూసుకొచ్చిన TS 13 UA 7633 కారు.. చైతన్యపురి యూటర్న్ వద్ద రోడ్డు దాటుతున్న రవి, ధన్రాజ్ అనే ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటన తర్వాత మృతులను ఢీకొట్టిన కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు