ETV Bharat / jagte-raho

అదుపుతప్పి బోల్తాపడిన కారు.. ఇద్దరికి స్వల్ప గాయాలు.. - కారు బోల్తా

కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ బైపాస్​ రోడ్డులో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

car accident at zaheerabad bypass road in sangreddy district
అదుపుతప్పి బోల్తాపడిన కారు.. ఇద్దరికి స్వల్ప గాయాలు..
author img

By

Published : Oct 30, 2020, 3:20 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న కారు పల్టీలు కొడుతూ బోల్తాపడింది.

కారులోని బెలూన్లు విచ్చు కోవడం వల్ల డ్రైవర్​తో సహా మరో ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలికి జహీరాబాద్ ఎస్సై వెంకటేశ్​ చేరుకుని క్షతగాత్రులను జహీరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: పందిని ఢీకొట్టిన ఆటో.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.