ETV Bharat / jagte-raho

ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి - హైదరాబాద్‌- సాగర్‌ రహదారిపై ఘోరప్రమాదం

Car accident at Dairyapuri Tanda, Chintapalli mandal in Nalgonda district
ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి
author img

By

Published : Sep 4, 2020, 7:03 AM IST

Updated : Sep 4, 2020, 8:55 AM IST

06:58 September 04

ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి

ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి

హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై కారు బోల్తా పడి... ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న వాహనం... తండా మూల మలుపు వద్ద బోల్తా పడింది. తొలుత నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరొకరు తీవ్రంగా గాయపడి గంట పాటు నరకయాతన అనుభవించారు. చివరకు ఆ బాధితుడు కూడా ప్రాణాలు విడిచాడు. నిద్ర మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణాలుగా... అక్కడివారు చెబుతున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాత పడటంతో... వారి వివరాల కోసం పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకరి వద్ద దొరికిన ఆధార్ కార్డులో... అంబర్‌పేట చిరునామా కనిపించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Sep 4, 2020, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.