ETV Bharat / jagte-raho

విజయవాడలో గుప్పుమంటున్న గంజాయి..! - Vijayawada crime news

విజయవాడ నగరంలో గంజాయి దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. విశాఖ మన్యం నుంచి నగరానికి అక్రమరవాణా జోరుగా నడుస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలు ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతున్నాయి. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నగరంలో గంజాయి మాఫియా విక్రయాలు కొనసాగిస్తుంది. టాస్క్​ఫోర్స్ తనిఖీల్లో గంజా ముఠాలను అరెస్ట్ చేస్తున్నా... దందా ఆగట్లేదు.

Vijayawada crime news
విజయవాడలో గుప్పుమంటున్న గంజాయి..!
author img

By

Published : Oct 5, 2020, 11:45 AM IST

విజయవాడలో గుప్పుమంటున్న గంజాయి..!

గంజాయి మత్తు దందా నగరంలో విచ్చలవిడిగా సాగుతోంది. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. విశాఖ, ఒడిశా సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా గంజాయిని పండిస్తున్నారు. డబ్బు కోసం దళారులు స్థానికులను ఏజెంట్లుగా వినియోగించుకుంటున్నారు. నర్సీపట్నం, రంపచోడవరం, విశాఖ మన్యం ప్రాంతాల నుంచి అత్యధికంగా గంజాయి రవాణా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు, రోడ్డు మార్గాల్లో అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

గమ్యస్థానానికి ఇలా...

ఏజెన్సీ ప్రాంతం నుంచి సరకును దగ్గర్లోని రైల్వేస్టేషన్​కు చేర్చి అక్కడినుంచి వెళ్లిపోతారు. రైల్వేస్టేషన్​లో మరొకరు గమ్యస్థానానికి చేర్చి వెళ్లిపోతారు. గమ్యస్థానం నుంచి వేరొకరు సరకును తీసుకువెళతారని పోలీసులు చెబుతున్నారు. గంజాయిని చేరవేసినందుకు ఒక్కొక్కరికి కమీషన్ ఇస్తారు. సరకును బట్టి ధర ఫిక్స్ చేస్తారు. ఏజెంట్లు అత్యధికంగా పేదలే ఉంటారు. ఎవరి సరకును తీసుకెళ్తున్నారో.. ఎవరు తీసుకుంటారో తెలియకుండా దళారులు జాగ్రత్త పడుతుంటారని పోలీసులు వివరిస్తున్నారు.

డబ్బు కోసం..

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ప్రధాన నగరంగా మారింది. అక్రమార్కులు డబ్బుకోసం గంజాయి దందాను నగరంలో విస్తృతం చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా మత్తు దందాను కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సరదాగా మత్తును అలవాటు చేస్తారు. బానిసైన కొందరు యువకులు గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. యువకులు విశాఖ, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కేజీ 3 వేల రూపాయలు చొప్పున గంజాయి కొని నగరంలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

మత్తుకు బానిసలై...

మరోవైపు నరగంలో బ్లేడ్ బ్యాచ్, పోకిరీలు గంజాయి మత్తుకు బానిసలై దాడులకు తెగబడుతున్నారు. విజయవాడ నగరంలో 15 మంది వరకు విక్రేతలున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మత్తుకు బానిసైన మైనర్లను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయి రవాణాకు జంక్షన్​గా విజయవాడ మారుతుంది. ఒడిశా, విశాఖల నుంచి విజయవాడ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, చెన్నైలకు గంజాయి అక్రమరవాణా కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 2వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అనుమానం రాకుండా...

విదేశాల నుంచి చదువుకునేందుకు నగరానికి వచ్చిన విద్యార్థులు ఎండి అనే డ్రగ్​ను బెంగళూరు, హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి విజయవాడలో విక్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మత్తుకు బానిసలైన 20 మంది యువకులకు డీఅడిక్షన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. కూరగాయలు, మొక్కజొన్న లోడ్​లలో, చీరల ప్యాకెట్లు, లారీలు, కార్లలో ప్రత్యేక అరలు తయారు చేసి అనుమానం రాకుండా అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు.

సులువుగా ఆకర్షణ..

యువకులు మత్తుకు సులువుగా ఆకర్షణ అవుతారని సైక్రియాట్రిస్టులు చెబుతున్నారు. సరదాగా అలవాటై గంజాయికి బానిసలవుతారని వివరిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మానసిక వైద్యులు అంటున్నారు. మత్తు పదార్థాల మాఫియాను పోలీసులు, ఎక్సైజ్, డీఆర్​ఐ అధికారులు సమన్వయంతో అరికట్టాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని.. ప్రవర్తనలో మార్పు వస్తే తమకు సమాచారమివ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ... వంశీ అద్దె నేత.. అసలైన వైకాపా నాయకుడిని నేనే: వెంకట్రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.