విశాఖ గాజువాకలో టీ దుకాణం నడుపుతున్న మహిళపై కత్తితో దాడిచేసి మేడలో నల్లపూసలు లాక్కెళ్లాడు ఓ దొంగ. గుర్తుతెలియని వ్యక్తి టీ దుకాణం వద్దకు వచ్చాడు. సిగరెట్ కావాలని అడిగాడు. అందరికీ ఇచ్చినట్లే అతడికీ.. ఇచ్చి డబ్బులు తీసుకుంది ఆ షాపు నిర్వాహకురాలు. అక్కడే దమ్ము కొడుతున్న అతడి చూపు మహిళ మెడలోని నల్లపూసల గొలుసు మీద పడింది.
ఆమె ఆదమరుపుగా ఉన్న సమయం గమనించాడు. ఇంకేముంది గొలుసు బలంగా లాగేశాడు. అనూహ్య సంఘటనతో ఉలిక్కి పడ్డ బాధితురాలు వెంటనే తేరుకుని ప్రతిఘటించింది. ఆమెపై కత్తితోదాడి చేసి మరీ గొలుసు దొంగతనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఇవీ చదవండి: ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన