ETV Bharat / jagte-raho

రాత్రి పూట క్యాబ్ ఎక్కితే గ్యారెంటీ లేదు..!

ఒంటరిగా వెళ్లే అతివలే వారి లక్ష్యం...అందినకాడికి దోచుకొనిపోడం వారికి పరిపాటిగా మారింది. క్యాబ్ డ్రైవర్ల ముసుగులో మహిళలను బెదిరిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఐటీ కారిడార్ ప్రాతం, శంషాబాద్​ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేటు క్యాబ్​లో  ప్రయాణించాలంటేనే నారీమణులు జంకుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు మహిళల కోసం ప్రత్యేక భద్రత, గస్తీలు పెంచామని చెబుతున్నారు.

రాత్రి పూట క్యాబ్ ఎక్కితే గ్యారెంటీ లేదు..!
author img

By

Published : Jul 6, 2019, 5:31 PM IST

భాగ్యనగరంలో భద్రతకు పెద్దపీట వేస్తున్నామని...మహిళలకు రక్షణగా షీ టీమ్స్​ పనిచేస్తున్నాయని ప్రభుత్వం ఘంటా పథంగా చెప్పుతున్నప్పటికీ..నగరంలో అతివలపై దాడులు మాత్రం ఆగటం లేదు.

గత నెలలో వర్షితా రెడ్డి అనే యువతి మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు వెళ్ళేందుకు క్యాబ్ ఎక్కింది. విమానాశ్రయంలో దించిన తర్వాత డ్రైవర్​కి డబ్బులు ఇస్తున్న సమయంలో డ్రైవర్ అతని పక్కన ఉన్న మరో వ్యక్తి ఆమెను బెదిరించి దగ్గరున్న చరవాణి, బ్యాగ్​లను లాక్కోని ఉడాయించారు. దీనిపై బాధితురాలు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి...రిమాండ్​కు తరలించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ మహిళా ఐటీ ఉద్యోగిని శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వెళ్లడానికి క్యాబ్ ఎక్కింది. ఉన్నట్టుండి కోకాపేట్ టోల్ గేట్ రాగానే కారులో నుంచి కాపాడండి అంటూ బయటకు దూకి... నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తనని కారులో ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ వేరే మార్గానికి కారు మళ్లించాడని, తొండుపల్లి టోల్ గేట్ వద్ద కారును అనుమాన్పాదంగా నడిపాడని పేర్కొంది. అలాగే తన వద్ద ఉన్న చరవాణి , పదివేల రూపాయల నగదును లాక్కున్నారని తెలిపింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ...ఆకతాయిల ఆటలు ఆగడంలేదనందుకు ఈ ఘటనలే నిదర్శనం.

హాక్​ ఐ యాప్​ను వినియోగించుకోవాలి

విమానాశ్రయం వద్ద మూడంచెల భద్రత.... అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఐదు కిలోమీటర్ల వరకూ పటిష్ఠ భద్రత ఉంటుందని శంషాబాద్​ డీసీపీ తెలిపారు. రాత్రి వేళల్లో షీ క్యాబ్స్​ అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి ఒంటిరిగా విమానాశ్రాలకు వచ్చే మహిళలు ప్రైవేటు క్యాబ్​లు ఎక్కవద్దని... ఒక వేళ ఎక్కాల్సి వస్తే కారు నంబర్​ను నోట్ చేసుకోవాలని సూచించారు. క్యాబ్ డ్రైవర్ పై ఏదైనా అనుమానం వస్తే హాక్ ఐ యాప్​ను వినియోగించుకోవాలన్నారు. ఈ యాప్​ ద్వారా అటు పోలీసులు, నమోదు చేసుకున్న మరో ఐదుగురు వ్యక్తులకు మీరు ఎక్కడు ఉన్నారో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు ఇంలాటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

మహిళల భద్రత కోసం షీ క్యాబ్స్ ప్రవేశ పెట్టారు... కానీ అవి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదని, డయల్ 100కి ఫోన్ చేస్తే పోలీసుల నుంచి ఆలస్యంగా స్పందన వస్తోందని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కారు లోపల డ్రైవర్ వివరాలు తప్పకుండా ఉంచాలని కోరుతున్నారు. ఐటీ కారిడార్లలో రాత్రి వేళల్లో పని చేసే మహిళలకు భద్రత కల్పించాలని.. పోలీసుల స్పందన కూడా త్వరగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాత్రి పూట క్యాబ్ ఎక్కితే గ్యారెంటీ లేదు..!

ఇదీ చూడండి: బడ్జెట్​పై ట్విట్టర్​లో కేటీఆర్​ అసంతృప్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.