లంగర్ హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన బీటెక్ విద్యార్థి విజయ్.. రెండు రోజుల క్రితం ప్రశాంత్ నగర్లో ఉంటున్న తన స్నేహితుడి అద్దె ఇంటికి వచ్చాడు. కానీ అతను లేకపోవడంతో... ఫోన్ చేశాడు. 4 నెలల నుంచి రూమ్‌లో ఉండట్లేదని... ఊరు వెళ్లానని.. గది లాకర్ కూడ తన వద్దే ఉందని అతను తెలిపాడు.
తాళం బద్దలు కొట్టిన విజయ్... రెండు రోజులుగా రూమ్‌లోనే ఉంటున్నాడు. యజమాని ఇంటి అద్దె అడిగేందుకు ఉదయం వెళ్లగా... విజయ్ ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి