నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఒకే ఇంటికి చెందిన అన్నదమ్ములు శివ(13) అంజి (11) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన రాములు, భీమమ్మ దంపతుల కుమారులు శివ, అంజి పొలం వద్ద గేదె ఈనడంతో చూడడానికి వెళ్లారు. సమీపంలోని కుంటలో గేదెలు ఈదడం చూసి వాటిని అనుసరిస్తూ నీటి కుంటలోకి వెళ్లారు.
ఈత రాకపోవడం వల్ల నీటిలో పడి మృతి చెందారు. ఘటనా స్థలికి రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్