ETV Bharat / jagte-raho

ఏమై ఉంటుంది?: రైల్వే ట్రాక్​పై అన్నదమ్ముల మృత్యువాత

author img

By

Published : Jan 9, 2021, 6:15 PM IST

ఏమైందో ఏమో తెలీదు కానీ ఇద్దరు అన్నదమ్ములు రైల్వే ట్రాక్​పై శవమై తేలారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులు ఆత్మహత్య చేసుకున్నారా.. ప్రమాదవశాత్తు మరణించారా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. కొడుకులిద్దరి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

brothers died on railway track at sirpur in kumuram bheem district
ఏమై ఉంటుంది?: రైల్వే ట్రాక్​పై అన్నదమ్ముల మృత్యువాత

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు.

సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన శశికళ, బావూజీ దంపతులకు నలుగురు సంతానం. చిన్న కుమారులైన దిలీప్, శ్రీకాంత్​లు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే దిలీప్ గత ఏడాది ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడగా.. నడుం దెబ్బతింది. అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. తమ్ముడు శ్రీకాంత్​ అన్న దిలీప్​కు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

ఏమైందో ఏమో తెలీదు కానీ నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకెళ్లిన అన్నదమ్ములిద్దరూ.. ఉదయం సమీప రైల్వే ట్రాక్​పై శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకులిద్దరు మృత్యువాతపడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులు ఆత్మహత్య చేసుకున్నారా, ప్రమాదవశాత్తు మరణించారా అనే కోణంలో విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: భూ వివాదంలో వ్యక్తి హత్య.. ఆరుగురి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.