ETV Bharat / jagte-raho

వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య..! - అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఫిర్దోస్​ అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి ఆరోపించాడు.

bride suicide with in-laws family harassment in chandrayanagutta police station limits
వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
author img

By

Published : Dec 23, 2020, 4:58 PM IST

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన... హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. శపూర్​కు చెందిన ఫిర్దోసి అనే యువతి... బండ్లగూడ గౌస్​నగర్​కు చెందిన మొహ్మద్ ఇక్బాల్​తో నవంబర్ 5న వివాహం జరిపించారు. పెళ్లైన కొద్ది రోజుల నుంచే... భర్త, అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధింపులను గురిచేసేవారని మృతురాలి తండ్రి ఆరోపించాడు.

మంగళవారం రాత్రి మృతురాలి అత్త రబియా బేగం... ఫిర్దోస్​కు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఉస్మానియాలో చేర్చినట్టు తండ్రి జహంగీర్​కు సమాచారం ఇచ్చింది. మృతురాలి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకునేసరికి వారి అక్కడి నుంచి పారిపోయినట్టు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయారు. వరకట్న మృతి​ కింద కేసు నమోదు చేసి... నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: వివాహిత అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యే అంటున్న భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.