అపహరణ కేసులో సూత్రధారులైన భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన వీరిద్దరూ.. మొయినాబాద్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి... తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం సెల్‌ఫోన్‌లు ఆఫ్ చేసి హైదరాబాద్ నుంచి పారిపోయారు. కిడ్నాప్ వ్యవహారాన్ని పర్యవేక్షించిన భార్గవరామ్, గుంటూరు శ్రీను... ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన రోజు కారులోనే ఉన్నారా? ఇంట్లోకి వచ్చి ప్రవీణ్‌రావును తీసుకెళ్లారా అని పోలీసులు పరిశోధిస్తున్నారు. కిడ్నాప్ రోజు వారిద్దరూ ఒకే కారులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ముందు రోజు వీరిద్దరూ ఒకే కారులో... బంజారాహిల్స్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చిన వాహనంలో కాకుండా మరో కారులో వీరిద్దరూ ఉన్నట్లు ఆధారాలున్నా.... వాళ్లు ఇంట్లోకి వెళ్లారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.
నాకు తెలిసింది ఇంతే..
పోలీసుల ఆధీనంలో ఉన్న అఖిలప్రియ వారి ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదని తెలిసింది. నాకు తెలిసింది ఇంతే.. నన్నేమి అడగొద్దు అని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులు సహా మిగిలిన వారందరినీ రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని... హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. భూమా కుటుంబ కారు డ్రైవర్‌గా ఉన్న యువకుణ్ని కర్నూల్ జిల్లాకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు