హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో బర్కత్ అలీ అనే యువకుడిపై సాధిక్ అనే మరో యువకుడు బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బర్కత్ అలీకి తీవ్ర గాయాలయ్యాయి.
అలీ కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతణ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలతోనే సాధిక్ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బర్కత్ అలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
- ఇదీ చూడండి : అల్ఫాజోలం, డైజోఫాంలతోనే ఆ ఇద్దరు మృతి