భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహంచారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది.
ఆపి సోదాలు నిర్వహించగా అరటి పండ్ల గెలల మాటున అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని గుడిసె సంతోష్, భూక్య బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి: నిషేధిత గుట్కా బ్యాగులు స్వాధీనం.. బీదర్ నుంచి తీసుకొచ్చి విక్రయం