ETV Bharat / jagte-raho

యాసిడ్ దాడి బాధితురాలికి భాజపా రాష్ట్రనేత పరామర్శ - acid attack on a woman in jagtial

జగిత్యాల జిల్లాలో బుధవారం రోజున యాసిడ్ దాడికి గురైన స్వాతి అనే వితంతువు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని భాజపా రాష్ట్ర నాయకుడు ధన్​పాల్ సూర్యనారాయణ పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.

bjp state leader visitated acid attack victim swathi in nizamabad
యాసిడ్ దాడి బాధితురాలికి భాజపా రాష్ట్రనేత పరామర్శ
author img

By

Published : Dec 24, 2020, 3:13 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యాసిడ్ బాధితురాలు స్వాతి చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర నాయకుడు ధన్​పాల్ సూర్యనారాయణ ఆసుపత్రిని సందర్శించారు. స్వాతిని పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.

కూలీ పని చేసుకుని బతికే స్వాతి అనే వితంతువు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్​ తండాలో నివసిస్తోంది. బుధవారం రోజున వేరే గ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్​కు వెళ్లిన స్వాతిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోసి పరారయ్యాడు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్వాతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.