ETV Bharat / jagte-raho

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి.. ఆందోళన - సూర్యాపేట జిల్లా నేర వార్తలు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆందోళనకు దిగారు.

Balinta dies due to negligence of hospital staff .. Anxiety
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి.. ఆందోళన
author img

By

Published : Sep 20, 2020, 6:47 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చన్నారం గ్రామానికి చెందిన మొగిలి ఉమామహేశ్వరి ఐదు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుకు కామెర్లు కావడం వల్ల ఖమ్మంకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కోదాడ ఆసుపత్రిలో ఉన్న ఉమా మహేశ్వరి తెల్లవారుజామున మృతి చెందింది.

ఆరోగ్యంగా ఉన్న తమ బిడ్డను ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో చంపేశారంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సరైన సమయంలో వైద్యులు స్పందించకపోవడం వల్లే చనిపోయిందని ఆరోపించారు. ఘటనపై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా.. ఫిట్స్​ రావడం వల్లే మహిళ చనిపోయినట్లు తెలిపారు.

Balinta dies due to negligence of hospital staff .. Anxiety
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి.. ఆందోళన

ఇదీచూడండి.. దొంగను చితకబాదిన ఆలయ కమిటీ సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.