ETV Bharat / jagte-raho

శిశువును అమ్మేసి.. మళ్లీ తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ..

వరుసగా రెండు కాన్పుల్లో ఆడ శిశువు జన్మించింది. మూడోసారి కూడా అమ్మాయి పుడుతుందని అనుకున్నారు. ఓ జంటకు లక్ష రూపాయలకి అమ్మకానికి పెట్టారు. అయితే 5 నెలలు తర్వాత మరో 4నాలుగు లక్షలు కావాలని డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మళ్లీ తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ పోలీసులని ఆశ్రయించారు.

baby sale incident at hyderabad nacharam
శిశువును అమ్మేసి.. మళ్లీ తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ..
author img

By

Published : Oct 30, 2020, 5:07 PM IST

హైదరాబాద్‌ నాచారంలో శిశు విక్రయం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శిశువును విక్రయించిన 5నెలల అనంతరం తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ మీనా, వెంకటేశ్‌ దంపతులు పోలీసులని ఆశ్రయించారు. దంపతులకు బాబును అప్పగిస్తే మళ్లీ అమ్ముకునే అవకాశం ఉన్నందున.. బాబును సీడబ్ల్యూసీకి అప్పగించి శిశువిహార్‌లో ఉంచామని నాచారం సీఐ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ జరిగింది

మీనా, వెంకటేశ్‌ దంపతులకు మొదట ఒక అమ్మాయి పుట్టి పురిటిలోనే చనిపోయింది. మళ్లీ రెండోసారి అమ్మాయి పుటింది. మూడోసారి కూడా అమ్మాయి పుడుతుందని అపోహతో 5నెలల గర్భిణిగా ఉన్నప్పుడే బిడ్డను అమ్మడానికి జానకి అనే మహిళకు సమాచారం ఇచ్చారు. జానకి తను పనిచేసే దగ్గర రాజేష్, నగీన దంపతులకు పిల్లలు లేరని తెలుసుకుని బిడ్డను ఇప్పిస్తానని చెప్పింది. బిడ్డ కోసం లక్ష రూపాయలు ఇస్తామని కాప్రా జీహెచ్ఎంసీలో పనిచేసే రాజేష్‌తో మాట్లాడుకున్నారు.

అనుకున్న విధంగా రాజేష్.. మీనాను తన భార్య నగీన పేరుతో ఈఎస్ఐ హాస్పిటల్‌లో డెలివరీ కోసం అడ్మిట్ చేశాడు. జూన్ 19 బాబు పుట్టాడు. మీనా డెలివరీ అయిన వెంటనే లక్ష రూపాయలు ఇచ్చి బాబును తీసుకున్నారు. ఇదంతా జరిగి దాదాపు 5 నెలలు కావొస్తుంది. మీనా, వెంకటేశ్‌ దంపతులు రాజేష్‌ను మరో నాలుగు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని నాచారం సీఐ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. డబ్బులు ఇవ్వక పోవడంతోనే మళ్లీ తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ ఫిర్యాదు చేశారన్నారు. మీనా, వెంకటేశ్‌ల బాబు విక్రయంపై ఇద్దరు దంపతులపై కేసు నమోదు చేశామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు.

ఇదీ చూడండి: రూ. 31.26 లక్షల హవాలా డబ్బును పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.