ETV Bharat / jagte-raho

ఓ వైద్యుడి నిర్లక్ష్యం... శిశువు ప్రాణం తీసింది..! - రాజన్న సిరిసిల్ల జిల్లా నేర వార్తలు

పండంటి బిడ్డకు జన్మనిచ్చాననే సంతోషం ఆమెకు ఎంతో కాలం నిల్వలేదు. బిడ్డకోసం కలలు కంటున్న ఆ తల్లికి పురిట్లోనే శిశువు దూరమైంది. ఓ డాక్టర్ నిర్వాకంతో పండంటి మగ బిడ్డకు నాలుగు రోజుల్లోనే ఆయుష్షు తీరింది. ముద్దులొలికే చిన్నారిని విగత జీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

baby-boy-died-due-to-doctor-neglection-in-rajanna-sircilla
ఓ వైద్యుడి నిర్లక్ష్యం... శిశువు ప్రాణం తీసింది
author img

By

Published : Dec 8, 2020, 8:36 AM IST

సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు రోజుల శిశువు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన సుజాత, వినోద్ దంపతులకు 5 రోజల క్రితం మగబిడ్డ పుట్టాడు. అనారోగ్యంతో ఉన్న బాబును సిరిసిల్ల పాత బస్టాండ్ వద్దగల ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులు చికిత్స అందించిన డాక్టర్... అంతా బాగానే ఉందంటూ సోమవారం ఇంటికి పంపించారు.

ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలో శిశువు మృతి చెందాడు. వెంటనే ఆస్పత్రి వద్దకు రాగా... తాళం వేసి డాక్టర్ వెళ్లిపోయారు. ఆ డాక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్నారని తెలుసుకున్న బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా... తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు బోరున విలపించారు.

ఇదీ చదవండి: సాఫ్ట్​వేర్​ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.