కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ తునికి వేణుపై గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు దాడికి యత్నించారు. సర్పంచ్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆందోళన చేపట్టారు. భిక్కనూరు గ్రామ పంచాయతీ వద్ద కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేపట్టేవారికి సర్దిచెప్పారు. భిక్కనూరులోని కొత్త చెరువు కట్ట కుంగడం వల్ల శుక్రవారం ప్రశాంత్ అనే యువకుడిని సర్పంచ్ ట్రాక్టర్‌తో పని చేయడానికి రమ్మన్నాడు. సాయంత్రం దురదృష్టవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి ప్రశాంత్ మరణించాడు.
ఈరోజు మృతుడి బంధువులు, ఎస్సీ కాలనీ వాసులు కలిసి వెళ్లి గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు. సర్పంచ్ నిర్లక్ష్యం వల్లే ప్రశాంత్ మృతి చెందాడని దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సర్పంచ్ వేణుకు పోలీసులు భద్రత కల్పించారు. కొందరు పెద్దమనుషులు వచ్చి వారికి నచ్చచెప్పి మృతుడి భార్యకు నష్టపరిహారం, ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పడం వల్ల ఆందోళన విరమించారు. ప్రశాంత్‌కు భార్య, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పక్షం రోజుల క్రితం పాప పుట్టింది.
ఇదీ చదవండి: అమానుష ఘటన: అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లారు