ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమంలో మరో మహిళా రైతు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడానికి చెందిన పాతూరి హైమావతి(58) సోమవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి హైమావతి ఎకరం భూమి ఇచ్చారు. ఉద్యమ ప్రారంభం నుంచి హైమావతి చురుగ్గా పాల్గొంటున్నారని రైతులు తెలిపారు. రోజూ తమతో ఉద్యమంలో పాల్గొన్న మహిళ ఒక్కసారిగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: కళ్ల ముందే ఇద్దరు కుమారులు మృతి.. గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదన