ETV Bharat / jagte-raho

సాయం కోరుతూ వచ్చాడు... సెల్​ఫోన్ ఎత్తుకెళ్లాడు! - సెల్​ఫోన్ దొంగతనం వార్తలు

దుకాణాదారుడి సెల్​ఫోన్​ను చాకచక్యంగా కొట్టేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. తనకు మాటలు రావంటూ సైగలు చేస్తూ సాయమడుగుతూనే సెల్​ఫోన్​ను దోచేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో జరిగింది.

cell phones theft
cell phones theft
author img

By

Published : Nov 13, 2020, 8:12 PM IST

సాయం కోరుతూ వచ్చాడు... సెల్​ఫోన్ ఎత్తుకెళ్లాడు!

ఏపీలోని అనంతపురంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కొత్త తరహాలో దొంగతనానికి పాల్పడ్డాడు. సాయం చేయాలని కోరుతున్నట్లు నటిస్తూ సెల్​ఫోన్​ను దోచుకెళ్లాడు. ఈ వ్యవహారమంతా సీసీ పుటేజీలో రికార్డు అయింది. పట్టణంలోని కమలానగర్​లోని డీసీఎంఎస్ రోడ్డులో ఉన్న పంచముఖి ప్రింటర్స్ దుకాణానికి గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు.

తనకు మాటలు రావంటూ సైగలు చేస్తూ దుకాణాదారుడికి ఓ కరపత్రాన్ని ఇచ్చాడు. దుకాణాదారుడు 10 రూపాయలు ఇస్తే ఇంకా ఇవ్వమని అడుగుతూ దగ్గరికి వచ్చాడు. అనంతరం అక్కడున్న సెల్​ఫోన్​ను చాకచక్యంగా కొట్టేశాడు. కొద్దిసేపటికి సెల్​ఫోన్​ కనిపించకపోవటంతో దుకాణదారుడు సీసీ పుటేజీని పరిశీలించి అవాక్కయ్యాడు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: బహుమతులు ఆశచూపుతాడు.. బంగారం దోచేస్తాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.