విశాఖ జిల్లా జీకే వీధి మండలం పి.కొత్తూరులో మందు బాబుకు ప్రమాదం తప్పింది. సంకురయ్య(55)అనే ఓ గిరిజనుడు మద్యం ఫూటుగా తాగి సీలేరు-గాజువాక హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కేశాడు. స్థానికులు ఎంత బతిమాలినా కిందకు రాకుండా విద్యుత్తు వైర్ల వైపు వెళ్లేందుకు యత్నించాడు.
అతన్ని వారిస్తూనే పోలీసులకు స్థానికులు విషయం చెప్పారు. సీలేరు జెన్ కోకు సమాచారమిచ్చిన పోలీసులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ఎట్టకేలకు టవర్ మీద నుంచి సంకురయ్యను గ్రామస్థులు, పోలీసులు క్షేమంగా కిందకు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి: ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్