మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి పేరు మీద ఉన్న మరో ఆస్తిని అనిశా అధికారులు గుర్తించారు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను నర్సింహారెడ్డి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. మాదాపూర్‌కు చెందిన ఓ మహిళ పేరుతో ఫ్లాట్‌ను నర్సింహారెడ్డి కొనుగోలు చేశారు. దీనిని రూ.25 లక్షలకు కొనుగోలు చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ మార్కెట్ విలువ ప్రకారం ఫ్లాట్ విలువ రూ.50 లక్షల పైనే ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేస్తున్నారు. సదరు మహిళ విదేశాలకు వెళ్లగా.. ఆమె తిరిగి వచ్చాక నర్సింహారెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని బయటపడనున్నాయి.
నర్సింహారెడ్డి కేసులో అరెస్ట్ చేసిన ఎనిమిది మంది బినామీలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా అనిశా అధికారులు దాఖలు చేసిన పిటీషన్‌పైనా గురువారం వాదనలు ముగిశాయి. నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని అనిశా అధికారులు కోరారు. నర్సింహారెడ్డి ఆస్తులను బినామీ పేర్ల మీదు కొనుగోలు చేసినందున.. వారందరిని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అనిశా తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనిశా న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: ఏసీపీ నర్సింహారెడ్డికి 14 రోజుల రిమాండ్