ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. అతని పేరుమీద ఉన్న బినామీ ఆస్తుల గురించి ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. దీంతో అనిశా అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను నర్సింహ ఎదుట ఉంచి ప్రశ్నించారు. ఏసీపీకి ప్రధాన బినామీగా ఉన్న చంద్రారెడ్డి పేరు మీద ఎన్ని ఆస్తులు కూడబెట్టారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు నర్సింహారెడ్డికి సహకరించిన ఇతర వ్యక్తులను అనిశా అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని సైతం నర్సింహారెడ్డి భార్య, ఆయన బినామీల పేరు మీద రిజిష్ట్రేషన్ చేసిన విషయంలో సంబంధిత శాఖాధికారులకు ఏమైనా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు రోజుల కస్టడీలో భాగంగా నర్సింహారెడ్డి కూడబెట్టిన ఆస్తుల గురించి పూర్తి సమాచారం సేకరించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 23న ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో పురోగతి కోసం.. న్యాయస్థానం అనుమతితో 4 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: 'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చేశారు'