ETV Bharat / jagte-raho

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్టు - సోషల్ మీడియాలో మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించాడని శివాజీ సేన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు.

accudsed arrested for commenting on religion
మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Nov 19, 2020, 2:52 PM IST

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ ​మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన కడారి దినకర్ హైదరాబాద్​లోని ఓ ఓల్డేజో హోంలో హోంటేకర్​గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఫేస్​బుక్, వాట్సాప్​లలో హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టాడు. శివాజీ సేన కార్యకర్తలు వేముల మధు, హరి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు దినకర్​ను అరెస్టు చేశారు.

ఉపేక్షించేది లేదు: ఏసీపీ నరేందర్

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను ఉపేక్షించేదిలేదని ఏసీపీ నరేందర్ తెలిపారు. తప్పుడు సందేశాలు ప్రచారం చేస్తూ.. ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆ మూడు డివిజన్లలో తెరాస ఓటమి ఖాయం: రఘునందన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.