సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శంకర్ నగర్ సమీపంలో రాజీవ్ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కరీంనగర్ జిల్లా గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు స్వాతి, వెంకటేశ్‌లుగా గుర్తించారు. భార్య స్వాతి గర్భవతి కాగా.. ఆమెకు వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. గర్భవతి అయిన స్వాతి అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు