ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా... మచిలీపట్నం బీచ్‌కు వెళ్లి వస్తుండగా గురజాడ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఇదీ చూడండి: మఠంపల్లిలో ఇంట్లో అందరూ ఉండగానే చోరీ..