డివైడర్ను ఢీకొట్టిన కారు... మరో కారును ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాహ్య వలయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
సమాచారం పోలీసులు అందుకున్న క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నల్గొండ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.