ETV Bharat / jagte-raho

ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను చితక్కొట్టిన స్థానికులు - kamareddy district latest crime news

కారణం తెలుసుకోకుండా మానవత్వం మరిచి ప్రజలు క్రూరత్వం ప్రదర్శించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు టీవీఎస్ మోపెడ్​ను ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. తన తప్పేమీ లేదని డ్రైవర్​ ఎంత మొత్తుకున్నా వినకుండా స్థానికులు చితక్కొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

accident at kamareddy district and Locals Beat RTC bus driver
ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను చితక్కొట్టిన స్థానికులు
author img

By

Published : Oct 29, 2020, 3:35 PM IST

రోడ్డు ప్రమాద ఘటనలో క్షతగాత్రుడిని పక్కన పెట్టి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్థానికులు తీవ్రంగా చితకబాదారు. ఆర్టీసీ బస్సు టీవీఎస్ మోపెడ్​ను ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సిరిసిల్ల రోడ్డులో కరీంనగర్ నుంచి కామారెడ్డి వస్తున్న కరీంనగర్ ఒకటో డిపో బస్సు టీవీఎస్ మోపెడ్​ను ఢీకొంది. ఈ ఘటనలో మోపెడ్​పై వెళ్తున్న పసుల పోషయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని డ్రైవర్ మల్లయ్యను స్థానికులు చితక్కొట్టారు.

తన తప్పేమీ లేదని చెప్పినా వినిపించుకోకుండా డ్రైవర్​పై ఇష్టానుసారం దాడికి పాల్పడ్డారు. దెబ్బలకు తట్టుకోలేక పారిపోవాలని ప్రయత్నించినా వదలలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరగడానికి తన తప్పేమీ లేదని.. మోపెడ్​పై వస్తున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ బస్సుకు ఎదురుగా వచ్చాడని మల్లయ్య తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని ఓ ప్రయాణికుడు తెలిపారు.

ఇదీ చూడండి: బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.