ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో లొల్లి.. పరామర్శకు వస్తున్న ఇద్దరు మృతి - latest news on accident at devarakonda bus stand

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

accident at devarakonda bus stand
బైకును ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి
author img

By

Published : May 7, 2020, 10:02 AM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బైకుపై ఉన్న చందర్​, స్కైలాబ్​లు అక్కడికక్కడే మృతి చెందారు.

కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకల వద్ద గల ఓ బెల్టు షాప్​లో కొందరు యువకులు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలు కావడం వల్ల దేవరకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బంధువులు చందర్​, స్కైలాబ్​లు గుడితండా నుంచి దేవరకొండకు వస్తుండగా.. దేవరకొండ బస్​స్టాండ్ వద్ద వెనక నుంచి వస్తున్న లారీ వీరి బైక్​ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చందర్​ నాంపల్లి రైల్వే స్టేషన్​లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ఇదీచూడండి: రోడ్డు ప్రమాదం.. గాయపడ్డ ఎనిమిదేళ్ల బాలిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.