వివాహం కావటం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తుకారం గేట్ లోయ నగర్లో నివాసం ఉంటున్న అనిత(36)కు గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా ఏ ఒక్కటీ కుదరకపోవటంతో అనిత తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
పెళ్లి కావటం లేదనే ఆందోళనతోనే యువతి తనువు చాలించినట్లు పోలీసులు వివరించారు. ఇటీవల ఆమె సోదరి కూడా అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: అలా చూసి.. ఇలా ఎత్తుకెళ్తారు.. ఆఖరికి చిక్కారు