ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువకుడు మృతి - హైదరాబాద్​ వార్తలు

కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

author img

By

Published : Dec 13, 2020, 10:15 AM IST

హైదరాబాద్​ కూకట్​పల్లిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

పల్సర్ వాహనంపై వెళ్తున్న ప్రకాశ్​ను కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ ఏ836 వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. యువకుడు ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సినిమా థియేటర్​ గోడ కూలి వ్యక్తి మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.