యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కమ్మగూడెం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడి ఓ యువకుడు మృతిచెందాడు.
మృతుడు రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బండిరాళ్ల పవన్‌గా పోలీసులు గుర్తించారు. వలిగొండకు బైక్‌పై వచ్చిన పవన్... రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల వర్షాలకు రోడ్డు కోసుకుపోవటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : ఇవాళ యాసంగి రైతుబంధు విడుదలపై కేసీఆర్ సమీక్ష