ETV Bharat / jagte-raho

ఇల్లందులో యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

author img

By

Published : Oct 30, 2020, 9:55 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దారుణం జరిగింది. ఓ యువతిపై సందీప్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమెను ముళ్లపొదల్లో పడేసి... రక్తం చేతులతో రోడ్డుపై వెళ్తుండగా పెట్రోలింగ్‌ పోలీసులు చూసి విచారించగా విషయం వెలుగుచూసింది.

ఇల్లందులో యువతిపై యువకుడు కత్తితో దాడి
ఇల్లందులో యువతిపై యువకుడు కత్తితో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. పట్టణానికి చెందిన యువతిపై సందీప్​ అనే యువకుడు గురువారం అర్ధరాత్రి సమయంలో కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమెను ముళ్లపొదల్లో పడేసి... రక్తం చేతులతో రోడ్డుపై వెళ్తుండగా పెట్రోలింగ్​ పోలీసులకు తారసపడ్డాడు. అతడిని విచారించగా... యువతిపై దాడి చేసినట్లు తెలిపాడు.

ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు అపస్మారకస్థితిలో ఉన్న యువతిని ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రేమ పేరుతో యువతిని కొంతకాలంగా సందీప్‌ వేధిస్తున్నట్లు యువతి బంధువులు చెబుతున్నారు. సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.