ETV Bharat / jagte-raho

విషాదం: ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా కిందపడి కూలీ మృతి - మహబూబ్​నగర్ జిల్లా నేర వార్తలు

ఇంటి పైకప్పు పనులు చే​స్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కూలీ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

A worker dies while doing roof work
విషాదం: ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా కిందపడి కూలీ మృతి
author img

By

Published : Aug 31, 2020, 6:27 AM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మీ నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి గోపాల్​ అనే కూలీ మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు నాగర్​ కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట మండలం రాళ్ల చెరువు తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షంషుద్దీన్​ తెలిపారు.

ఇదీచూడండి.. నగరంలో పెరిగిపోతున్న బైక్ చోరీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.