ETV Bharat / jagte-raho

పెళ్లని నమ్మించింది... రూ.5 కోట్లు కొట్టేసింది!

నేను వైద్యురాలిని.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.. కుటుంబంలో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.. మీరు కోర్టు ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా సాయం చేస్తే అదంతా మీకే చెందుతుందంటూ ఎన్‌ఆర్‌ఐలకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వల విసిరిన కి‘లేడీ’ వ్యవహారంలో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురి నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

A woman who has earned five crores in the name of marriage in hyderabad
పెళ్లి పేరిట ముగ్గురి నుంచి 5 కోట్లు కొట్టేసిన కిలేడి
author img

By

Published : Jun 4, 2020, 4:32 PM IST

పెళ్లి పేరిట రూ.కోటికి పైగా వసూలు చేసిందంటూ ఓ ఎన్‌ఆర్‌ఐ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా మే 27న సదరు మహిళను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.65 లక్షలు మోసపోయానంటూ మరో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలతో ఇద్దరినీ మోసం చేసింది ఒకరేనని తేలింది. పూర్తి వివరాలను రాబట్టేందుకు మంగళవారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

హబ్సిగూడకు చెందిన మరో వ్యక్తిని కూడా ఇదే తరహాలో బురిడీ కొట్టించి రూ.3.5 కోట్లు టోపీ పెట్టినట్లు గుర్తించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.500, రూ.1300, రూ. 2,500 మాత్రమే ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. బాధితుల్లో ఏ ఒక్కరూ ఆమెను వ్యక్తిగతంగా కలవలేదు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో అందరమైన అమ్మాయిల ఫొటోలను ఉంచి ముగ్గులోకి దించింది. కుమారుడు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించారు. కాజేసిన డబ్బులతోనే సొంతంగా ఓ చోట గోశాల నిర్వహిస్తున్నట్లు పోలీసులకు చెప్పడం గమనార్హం.

ఇదీ చూడండి:నేడో, రేపో భారత్​కు మాల్యా.. నేరుగా కోర్టుకే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.