నిజామాబాద్ జిల్లా మోస్ర మండల కేంద్రంలో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న దుర్గామాత విగ్రహాన్ని ఉత్సవ కమిటి సభ్యులు ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. కాగా ఈ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడడం వల్ల విద్యుదాఘాతంతో నవీన్, రవీందర్ గౌడ్‌కు గాయాలయ్యాయి.
హుటాహుటిన స్పందించిన పోలీసు సిబ్బంది వారి వాహనంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వెంటనే స్పందించి సాయం అందించిన వర్ని మండల ఎస్సై అనిల్ రెడ్డి, సిబ్బందికి ఉత్సవ కమిటి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: షేర్‌చాట్‌లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి