హైదరాబాద్ ప్రేమ్‌నగర్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేసేందుకని అంబర్‌పేట్‌లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంకు వెళ్లాడు. డబ్బులు జమ చేస్తుండగా.. మిషన్ నుంచి తిరిగి రూ.67 వేలు వచ్చాయి. వెంటనే కనకయ్య ఆ డబ్బులను అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మల్లేశ్‌కు అందించారు.
కష్టపడకుండా వచ్చిన సొమ్మును తీసుకోకుండా.. స్టేషన్‌కు తెచ్చిచ్చిన కన్నయ్యను ఎస్సై అభినందించారు.
ఇదీ చూడండి: బెట్టింగ్ జోలికి పోవద్దు... ఆర్థికంగా నష్టపోవద్దు: సీపీ సజ్జనార్