ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఎంతో మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా బలి తీసుకుంటూనే ఉంది. ఉపాధి లేక ఎందరో రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్​కి వెళ్లి పనిచేసుకోవాలని ఓ వ్యక్తి అప్పు తెచ్చి మరీ వెళ్తే... కరోనా వేళ అక్కడా పని కరవైంది. చేసేది లేక ఇంటికి తిరిగివచ్చాడు. ఓ వైపు ఉపాధి లేక... మరోవైపు అప్పులు... కూతురు అనారోగ్యం వెరసి ఆ వ్యక్తి ఆత్మహత్యకు దారి తీశాయి.

author img

By

Published : Nov 14, 2020, 12:31 PM IST

a person committed suicide with financial problems in navipet mandal
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలేశ్వర్​కు చెందిన యువకుడు చాకలి రాజు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం రూ.లక్ష అప్పు చేసి ఉపాధి కోసం దుబాయ్​కి వెళ్ళాడు. కరోనాతో ఉపాధి లేకపోవడంతో తిరిగి వచ్చేశాడు. ఇక్కడ పని కరవై... అప్పును ఎలా తీర్చాలో అని మనస్థాపం చెందాడు. దానికి తోడు పెద్ద కూతురు మానసికంగా బాగా లేకపోవడంతో వైద్య ఖర్చులకు డబ్బులు లేక మానసికంగా క్రుంగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడని ఎస్సై యాకుబ్ తెలిపారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: వైద్యం వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.