మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు భీమయ్యకు అతని తమ్ముడి కుమారులు మధ్య కొంత కాలంగా భూతగాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా మంత్రాలు చేస్తున్నాడని నెపంతో శనివారం తమ్ముడి కొడుకులు ఇద్దరు భీమయ్యపై గొడవ పడ్డారు.
తన ఇంట్లోనే ఇనుప రాడ్తో తలపై దాడి చేయడం వల్ల ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో నిందితులిద్దరిని దండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.