జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును తాగునీటి బావిలో పడేశారు. శిశువు మృతదేహం బావిలో తేలటంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.
శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో గర్భిణీలు ఎవరున్నారు.. ఎక్కడ ప్రసవం జరిగింది.. అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: పబ్జీ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య