ETV Bharat / jagte-raho

భర్త ఇంటి ఎదుట ఓ వివాహిత దీక్ష - telangana latest news

అప్పుడు ప్రేమించి.. పెద్దలు కాదంటే ఎదిరించి కులాంతర వివాహం చేసుకుంది. మూడేళ్లు భర్తతో కాపురం చేసింది. కానీ ఇప్పుడు .. అదే భర్త ఇంటి ఎదుట న్యాయం కోరుతూ దీక్ష చేస్తోంది. ఈ మూడు సంవత్సరాల వివాహ కాలం వివాదానికి ఎందుకు దారి తీసిందో .. ఆమె భర్త ఇంటి ఎదుట ఎందుకు న్యాయం కోరుతుందో తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి.

A married initiation in front of the husband's house
భర్త ఇంటి ఎదుట ఓ వివాహిత దీక్ష
author img

By

Published : Dec 24, 2020, 10:58 PM IST

న్యాయం చేయాలని కోరుతూ.. భర్త ఇంటి ఎదుట ఓ వివాహిత దీక్ష చేస్తోంది. ఈ ఘటన ఆత్మకూర్ మండలం మొరిపిరాల గ్రామం చిన్నగూడెంలో చోటు చేసుకుంది.

మూడేళ్ల క్రితం..

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం మొరిపిరాల ఆవాస గ్రామమైన చిన్నగూడెంకు చెందిన.. యాస నవీన్ రెడ్డి, బెజ్జరబోయిన మౌనిక ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ పెద్దలు అడ్డుచెప్పారు.కానీ.. పెద్దలను ఎదిరించి 2017 అక్టోబర్​లో శ్రీశైలం వెళ్లి కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహనంతరం కొన్నాళ్లు అబ్బాయి వాళ్లింట్లో కాపురమున్నారు. అనంతరం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగించారు.

ఏడాది నుంచి ..

రెండేళ్లు తనతో మంచిగా ఉన్న నవీన్ రెడ్డి ఏడాది నుంచి తరచూ కట్నం కావాలని వేధిస్తున్నాడని, అక్రమ సంభందాల పేరుతో హింసిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను విడిపించుకునేందకు చిత్ర హింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

మూడు నెలల క్రితం ..

ఈ గొడవల నేపథ్యంలో.. మూడు నెలల క్రితం స్వగ్రామం వచ్చారు. పలుమార్లు గ్రామ పెద్దల మధ్య రాజీకోసం చర్చలు జరిపారు. కానీ రాజీ కుదరలేదు.

కొద్దిరోజుల క్రితం..

భర్త అతని తల్లిదండ్రులు కొట్టి తాళి, మెట్టెలు బలవంతంగా లాక్కున్నారని బాధితురాలు ఆరోపించింది. కులం తక్కువ అని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని వాపోయింది.

తాజాగా..

బుధవారం మరోమారు ఈ విషయమై గ్రామ పెద్దల సమక్షంలో .. ఇరు కుటుంబాల తల్లి దండ్రులుకు పెద్దలు రాజీ మార్గాలు సూచించారు.కానీ .. యువకుడు, అతని తల్లిదండ్రులు అంగీకరించకుండా ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లి పోయారు. దీంతో బాధితురాలు న్యాయం చేయాల్సిందిగా భర్త ఇంటి ముందు దీక్ష చేపట్టింది. న్యాయం చేయాలని కోరుతూ ఆత్మకూర్ పోలీసు ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.