మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి జైలుకు వెళ్లాడు. తల్లి మృతిచెంది... తండ్రి జైలుపాలవ్వడం వల్ల వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
జడ్చర్ల గాంధీచౌక్ సమీపంలోని చైతన్యనగర్ కాలనీకి చెందిన మల్లేష్ మద్యం మత్తులో భార్య జంగమతో గొడవపడి ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం జరగగా... స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సోమవారం కేసు విచారణలో భాగంగా జిల్లా ఎస్పీ రాజేశ్వరి ఘటనాస్థలికి వచ్చారు.
విచారణకు వచ్చిన పోలీసులకు స్థానికులు మృతురాలి పిల్లల విషయం తెలియజేశారు. తల్లి మృతి చెంది, తండ్రి జైలుపాలవ్వడం వల్ల వారి పిల్లలు రెండేళ్ల తులసి, తొమ్మిదేళ్ల విజయ్ కుమార్ అనాథలయ్యారని వివరించారు. పిల్లల సంరక్షణకు బంధువులు ముందుకు రాకపోవడం వల్ల ఇద్దరినీ మహబూబ్‌నగర్‌లోని పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి; 'గల్లంతైన గొర్రెల కాపరి.. మంగళవారం ముమ్ముర గాలింపు చర్యలు'