రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నంది వనపర్తి గ్రామంలో అనుమాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వెలిగొండ గ్రామానికి చెందిన మహేశ్(21) రోజు వారి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేకపోయే సరికి చాలా ఆస్పత్రులు తిరిగాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఆరోగ్యం మెరుగుపడలేదు. బంధువుల సలహా మేరకు నంది వనపర్తిలో శ్రీహరి అనే ఓ మాంత్రికుడి దగ్గరకు ఈ నెల 24న వెళ్లాడు. ఒక్క రోజులో మంత్రాలు వేసి.. పటం గీసి ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించాడు ఆ మాంత్రికుడు. ఇందుకోసం రూ.20వేలు ఖర్చు అవుతుందన్నాడు. శ్రీహరి మాటలు నమ్మిన మహేశ్ రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు.
మంత్రాలకు రోగం నయం కాకాపోవడంతో ఆరోగ్యం క్షీణించి సోమవారం రాత్రి నంది వనపర్తి గ్రామంలో మహేశ్ మృతి చెందాడు. మంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి తన భర్త ప్రాణాలు పోవడానికి కారణమైన శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని మహేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాంత్రికుడి మాటలు విన్నందుకే తన భర్త మృతి చెందాడని ఆమె వాపోయింది.
ఇవీ చూడండి: 1100ఏళ్ల నాటి బంగారు నాణేలు లభ్యం