కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని చింతల్కి చెందిన భువన్ రెడ్డి. కొంతకాలంగా అతని భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం కలహాల కారణంగా అతని భార్య.. తన అక్క దగ్గరకు వెళ్లిపోయింది. భువన్ రెడ్డి స్నేహితుడితో కలిసి అక్కడకూ కూడా వెళ్లి వారిని కొట్టారు. దానిపై కేసు నమోదైంది.
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన భువన్ రెడ్డి ఈ రోజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం