డబ్బుల కోసం ఇంతదాష్టీకానికి ఒడిగడతారా..!
అప్పటి వరకూ తమ తండ్రి బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చిన వైద్యులు.. మరుక్షణంలోనే చనిపోయాడని చెప్పడం విని కుటుంబసభ్యులు నిర్ఘాంత పోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని సంగీతరావు కుమార్తెలు జెస్సీ, బిన్నీ ఆరోపించారు. డబ్బుల కోసం సినీఫక్కీలో నాటకమాడి కనీసం తమని చూడటానికి కూడా అనుమతించలేదని వాపోయారు. డబ్బంతా కట్టించుకున్న తరువాత తమ తండ్రి చనిపోయిన విషయం చెప్పారని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం తమకు ఎలాంటి సమాచారం లేకుండా మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారని నిరసించారు.
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం
పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోగా.. ఎస్సై తమతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బంధువులతో కలిసి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని విలపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నచ్చచెప్పిన పోలీసులు
ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మృతదేహాన్ని తరలించామని ఏసీపీ తిరుపతన్న తెలిపారు. తమ సిబ్బంది బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదన్నారు.
ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేశారు.