నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సిరిగంప సతీశ్ (28) ద్విచక్ర వాహనంపై ఈదులూరు గ్రామానికి వెళ్తున్నాడు. తక్కెళ్లపాడు గ్రామం వద్ద రోడ్డుపై గుంతలు ఉండటం వల్ల బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాపడ్డ అతన్ని నల్లగొండలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
ఇదీ చూడండి: మా సిస్టం ఎప్పుడూ ఫెయిల్ కాదు: సీపీ అంజనీ కుమార్