ETV Bharat / jagte-raho

ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం... ఆక్సిజన్​ అందక బాలింత మృతి - వనపర్తిలో ఆక్సినజ్​ అందక బాలింత మృతి

వనపర్తి జిల్లాలో ఆక్సిజన్​ అందక బాలింత మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేకుండా బాలింతను అంబులెన్స్​లో తరలించడం వల్లే మృతిచెందిందని ఆరోపించారు.

ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం...  ఆక్సిజన్​ అందక బాలింత మృతి

author img

By

Published : Sep 27, 2020, 11:54 PM IST

ప్రసవం కోసం వచ్చిన మహిళ.. ఆక్సిజన్ అందక మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకొంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన సంధ్యారాణి.. కాన్పు కోసం వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆదివారం.. ఆమెకు శస్త్ర చికిత్స చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆ సమయంలో తల్లీబిడ్డ పరిస్థితి విషమంగా మారింది.

మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు అంబులెన్స్​లో అలంపూర్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దారి మధ్యలో ఆక్సిజన్​ అయిపోవడం వల్ల మహిళ పరిస్థితి మరింత విషమించింది. అనంతరం ఆస్పత్రికి చేరుకున్నాక.. వైద్యులు పరీక్షలు చేసి.. మరణించిందని నిర్ధారించారు.

వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహించారు. సౌకర్యాలు లేని అంబులెన్స్​లో​ ఎందుకు పంపించారంటూ వైద్యులను నిలదీశారు. తమ వద్ద ఎలాంటి పొరపాట్లు జరగలేదని.. తమకు సంబంధం లేదని సదరు డాక్టర్లు సమాధానం ఇచ్చారని వాపోయారు.

ఇదీ చూడండి: నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహానికి శవ పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.